కరోనా నియంత్రణ పెను సవాల్‌గా మారింది: ఈటల - warangal latest news
11:52 July 28
కరోనా నియంత్రణ పెను సవాల్‌గా మారింది: ఈటల
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా నియంత్రణ పెను సవాల్‌గా మారిందన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి వరంగల్‌లో సమీక్ష నిర్వహించారు. అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకు ఉందని.. ఇప్పుడు కూడా ధైర్యంగా ఈ సవాల్‌ను ఎదుర్కొందామని ఈటల పిలుపునిచ్చారు.
కరోనా బాధితులకు మరింత మెరుగైన సేవలను అందిద్దామన్నారు. వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని మరోసారి గుర్తు చేశారు. అన్ని రకాలుగా అండగా నిలిచి కరోనా సోకినవారిని కాపాడుకుందామన్నారు.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'