మట్టి వినాయకులు ముద్దు... రంగు వినాయకులు వద్దు - eenadu etv awareness
మట్టి వినాయక విగ్రహాలు వాడి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో వివేకానంద పాఠశాల విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. మట్టి వినాయక విగ్రహాలు ముద్దు...కలర్ విగ్రహాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. రసాయన విగ్రహాలు వాడటం వల్ల చెరువులు కలుషితమై మనుషులతో పాటు జంతువులు రోగాల బారిన పడుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం కాళోజీ కూడలి వద్ద మట్టి వినాయక విగ్రహాలు వాడటం వల్ల కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
- ఇదీ చూడండి : సహాయ నిరాకరణ ఉద్యమానికి బీజం అక్కడే