రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలనే పూజించి.. పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్ఆర్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి విగ్రహాల అమ్మకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక మండపాల్లో మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని సూచించారు. రసాయనలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతోందన్నారు.
'పర్యావరణహిత విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం' - undefined
రసాయన విగ్రహాలతో పర్యావరణం కలుషితం అవుతోందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్. వినాయక చవితికి ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
'పర్యావరణహిత విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం'
TAGGED:
matti vinayakulu