వరంగల్ నగరంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నారు. దయానంద కాలనీలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవిగా అలంకరించారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు పంపిణీ చేశారు.
కనకదుర్గ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రులు