ఓరుగల్లు పట్టభద్రులు ఇచ్చే తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్‌కు వచ్చేలా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో ఓరుగల్లు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రుల పాత్ర' అనే ఆంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి హజరయ్యారు.
రూ. కోట్లు వృధా..
దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించి విజయం అందించాలని పట్టభద్రులను రఘనందన్ రావు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున కోటి మొక్కల పేరుతో రూ. కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జూన్‌లో పెట్టాల్సిన మొక్కలను ఇప్పుడు పెడుతున్నారని విమర్శించారు.