Drainage problems for Market Road: డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో మురుగునీరు, నల్లా లీకేజీ వాటర్‌తో కుమార్‌పల్లి మార్కెట్ రోడ్ నీటమునిగింది. దీనికి తోడు నీళ్ల ట్యాంక్ నీరు వదలడంతో మరింత వరద ప్రవాహం పోటెత్తింది. మార్కెట్ రోడ్ జలమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జలమయమైన కుమార్ పల్లి మార్కెట్ రోడ్డును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. పేరుకే స్మార్ట్ సిటీ అని నగరం మొత్తం అధ్వాన్నంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
డ్రైనేజీ నిర్వహణ లోపం.. రోడ్లన్నీ జలయమం..
Drainage problems for Market Road: హన్మకొండలోని కుమార్‌పల్లి మార్కెట్ రోడ్డు జలమయమైంది. ఇదేదో వర్షాల వల్ల అనుకుంటున్నారా? డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో మురుగునీరు, నల్లా లీకేజీ వల్ల మార్కెట్ దారి చెరువును తలపిస్తుంది.
hanmakonda