వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రామకృష్ణనగర్‌లో దోపిడి దొంగలు పంజా విసిరారు. తాళం వేసి ఉన్న ఇంటితోపాటు మరో రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. అందినకాడికి దోచుకెళ్లారు. రైల్వే ఉద్యోగి హనుమంతరావు కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చే లోపు ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. బీరువాలో భద్రపరిచిన 13 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, ఒక కెమెరా ఎత్తుకెళ్లారు.
హనుమంతరావు ఉండే వీధిలోని మరో రెండు ఇళ్లలో దొంగలు చేతివాటం చూపించారు. రెండు ఇళ్లలో ఒక ట్యాబ్ ఫోన్ మినహా విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు.
హన్మకొండలో రెచ్చిపోయిన దొంగలు - undefined
హన్మకొండ రామకృష్ణనగర్‌లోని దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చోరబడి 13 తులాల బంగారు ఆభరణాలు, లక్ష నగదు దోచుకెళ్లారు.
![హన్మకొండలో రెచ్చిపోయిన దొంగలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3149550-thumbnail-3x2-chori.jpg)
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ
TAGGED:
GOLD AND CASH THEFT