వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి ట్రాన్స్‌జెండర్స్‌కు నిత్యావసర సరకులతో పాటు బియ్యం, కూరగాయలను అందజేశారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థ తరఫున నగరంలోని శివ నగర్‌కు చెందిన 200 మంది ట్రాన్స్‌జెండర్స్‌కు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో కలిసి కమిషనర్ పంపిణీ చేశారు.
వరంగల్‌లో ట్రాన్స్జెండర్లకు కిరాణా సామగ్రి పంపిణీ - 200 MEMBERS TRANSGENDERS IN WARANGAL
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నగర పాలక కమిషనర్ ట్రాన్స్ జెండర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. బాలవికాస స్వచ్ఛంద సంస్థతో కలిసి బియ్యం, కూరగాయలను అందజేశారు.

బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ట్రాన్స్ జెండర్లు ఇబ్బందులు పడుతున్నారనే సంగతిని బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ గుర్తించిందని సంస్థ సభ్యుడు శౌ రెడ్డి తెలిపారు. ఎక్కువ మంది రైళ్లలో యాచక వృత్తిని కొనసాగిస్తూ జీవనం గడుపుతారని శౌ రెడ్డి పేర్కొన్నారు. అందుకే క్లిష్ట పరిస్థితిలో నిత్యావసర సరకులను అందించేందుకు ముందుకు వచ్చామని స్పష్టం చేశారు.