తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తిపై.. అవగాహన కలిగి ఉండాలి - Warangal Coronavirus News

గ్రామీణప్రాంత ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తిపై.. తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కండపర్తిలో పేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

Distribution of essential commodities to poor families in Warangal
ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తిపై.. అవగాహన కలిగి ఉండాలి

By

Published : May 18, 2020, 11:34 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కండపర్తిలో పేద కుటుంబాలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. గ్రామీణప్రాంత ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం కాలం మారిందని ప్రభుత్వం సూచించిన నియమాలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు మాస్క్ ధరించాలని కోరారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం

ABOUT THE AUTHOR

...view details