తెలంగాణ

telangana

ETV Bharat / state

'రూ. 360కోట్లతో బతుకమ్మ చీరల పంపిణీ' - mla

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో స్థానిక ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

బతుకమ్మ చీరలను పంపిణీ

By

Published : Sep 25, 2019, 6:25 PM IST

రూ. 360 కోట్లతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవనంలో స్థానిక ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​తో కలిసి ఆయన చీరలను పంపిణీ చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలను అందజేస్తున్నారని కొనియాడారు. ఆంధ్ర పాలనలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతిని ప్రారంభించి బతుకమ్మను విదేశాలలో కూడా ఆడే విధంగా చేసిన ఘనత కవితదని కొనియాడారు.

బతుకమ్మ చీరలను పంపిణీ

ABOUT THE AUTHOR

...view details