ఎంజీఎం వైద్యులకు ప్రభుత్వం విప్, వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్... రూ.2 లక్షలు విలువచేసే సుమారు 250 పీపీఈ కిట్లు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు కరోనా వైరస్ సోకకుండా ఉపయోగపడతాయన్నారు.
వైద్యులకు వైరస్ రక్షణ కిట్ల పంపిణీ - వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్
కఠిన పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు కరోనా వైరస్ సోకకుండా ఉపయోగపడే కిట్లు వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ పంపిణీ చేశారు. సుమారు రెండు లక్షలు విలువచేసే 250 పీపీఈ కిట్లను ఎంజీఎం వైద్యులకు అందజేశారు.
వైద్యులకు వైరస్ సోకకుండా కిట్లు పంపిణీ
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తమపై ఉందన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్‌కు చరమగీతం పాడాలన్నారు.
ఇదీ చూడండి :'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి'