పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన వసతులు అందుతున్నాయా లేదా అనే అంశంపై న్యాయ సేవ సమితి కార్యదర్శి మహేశ్‌నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల శివారు ప్రాంతంలో ఉన్న పత్తి మిల్లులో పని చేసేందుకు వచ్చిన బీహార్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని.. సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం వల్ల న్యాయ సేవ సమితి ప్రతినిధులు విచారించేందుకు ఎనుమాముల ప్రాంతాన్ని సందర్శించారు.
న్యాయసేవ సమితి ప్రత్యేక దృష్టి.. తీరిన ఎనుమాములు వలసకూలీల కష్టాలు - వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల
వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల ప్రాంతంలో ఉంటున్న వలసకార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు వారికి న్యాయం చేసేందుకు రాష్ట్ర న్యాయసేవ సమితి కార్యదర్శి మహేశ్‌నాథ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. వారికి ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు సత్వరమే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
న్యాయసేవా సమితి ప్రత్యేక దృష్టి.. తీరిన ఎనుమాలు వలసకూలీల కష్టాలు
వలస కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు.. నిత్యావసర సరుకులను, ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదును వెంటనే చెల్లించాలని ఆదేశించారు. న్యాయ సేవ సమితి సందర్శన వలన వలసకూలీలకు న్యాయం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఎనుమాముల ప్రాంతంలో 200 మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని న్యాయ సేవా సమితి కార్యదర్శి మహేశ్‌నాథ్ తెలిపారు.
ఇదీ చూడండి:సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు