తెలంగాణ

telangana

ETV Bharat / state

కాజీపేట్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రారంభం - kazipet tahsildar office

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు రిజిస్ట్రేషన్ కోసం 3 స్లాట్లు నమోదు కాగా వారికి నిర్ణీత సమయాన్ని కేటాయించారు.

Dharanio registration process at kazipet tahsildar office
కాజీపేట్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ

By

Published : Nov 2, 2020, 3:16 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 3 స్లాట్లు నమోదయ్యాయి. కొనుగోలుదారు, అమ్మకందారు, సాక్షులు తహసీల్దార్ ముందు హాజరుకాగా.. భూమిపత్రాలను పరిశీలించిన ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ధరణి ప్రక్రియలో జరిగిన రిజిస్ట్రేషన్​ ద్వారా అమ్మకందారు పేరుమీద నుంచి కొనుగోలుదారు పేరు మీదకు భూమి బదలాయింపు సులభతరంగా జరుగుతుందని తహసీల్దార్ కిరణ్ తెలిపారు.

పూర్తి పారదర్శకతో పాటుగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ త్వరితగతిన పూర్తవడం ద్వారా కొనుగోలుదారులకు సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details