వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ట్రస్ట్ అధ్వర్యంలో 17,050 పేద కుటుంబాలకు సరకులు అందజేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి గుడ్ల ధనలక్ష్మి తెలిపారు.
గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - సరకుల పంపిణీ
వరంగల్ అర్బన్ జిల్లా ధర్మారం గ్రామంలో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామస్థులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యలో పేదలకు సరకుల పంపిణీ
ధర్మారం గ్రామానికి చెందిన తన స్నేహితురాలు కూలీల ఇబ్బందులను వివరించడం వల్ల స్పందించి... ట్రస్టు ద్వారా గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: 'అప్పుడే రైతులు అభివృద్ధి సాధించిన వారవుతారు'