మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు హన్మకొండ నుంచి తరలి వెళ్తున్నారు. హన్మకొండలోని హాయగ్రీవాచారి మైదానంలో... ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ... 335 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. భక్తులను ఆర్టీసీ బస్సుల్లో గద్దెల వరకు తీసుకుపోతున్నట్లు అధికారులు తెలిపారు.
హన్మకొండ నుంచి మేడారానికి భారీగా భక్తులు - devotees rush from hanmakonda
మేడారం జాతరకు హన్మకొండ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. నేరుగా గద్దెల దగ్గరకు తీసుకుపోతున్నట్లు అధికారులు తెలిపారు.

హన్మకొండ నుంచి మేడారానికి భారీగా భక్తులు