విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడుతోంది. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
పండగపూట భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ
ఓరుగల్లు జిల్లాలో భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పండగ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
పండగపూట భద్రకాళి ఆలయానికి భక్తుల రద్దీ
అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సాయంత్రం అమ్మవారికి అర్చకులు తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండిఃదసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు