వరంగల్ నగరంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. కార్తిక సోమవారాలు పురస్కరించుకుని నగరంలోని కోటిలింగాల ఆలయంతో పాటు... కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
చివరి కార్తిక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తికమాసం చివరి సోమవారం కావడంతో ఓరుగల్లులోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చివరి కార్తిక సోమవారం.. ఓరుగల్లు శివాలయాలకు పోటెత్తిన భక్తులు
స్వామివారికి భక్తులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఖిలా వరంగల్ కోటలోని స్వయంభు ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. చివరిరోజు భక్తులు ధ్వజస్తంభం ఎదుట ఉసిరిలో నేతిదీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
Last Updated : Dec 14, 2020, 10:33 AM IST