శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - Warangal Shree Bhadrakali Ammavaru
శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భద్రకాళి అమ్మవారు గాయత్రి దేవీ అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులుతీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అంతకు ముందుగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
- ఇదీ చూడండి:బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు