వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ పలు అభివద్ధి పనులకు భూమిపూజ చేశారు. జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్తో కలిసి ఆలయాన్ని సందర్శించారు.
దేవాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - వరంగల్ అర్బన్ జిల్లా తాజా సమాచారం
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. స్వామివారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.
దేవాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
స్వామివారికి మొక్కులు చెల్లించి, కోడెదూడను సమర్పించారు. ఆలయంలో 38 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.