వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్లోని దేవాదుల ప్రాజెక్టు నీరు కొత్తగా ఏర్పాటు చేసిన కాలువల ద్వారా పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలోని ఐనవోలు మండలం బొల్లికుంట గ్రామం మీదుగా దేవాదుల జలాలు విడుదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా నీటికోసం ఎదురుచూస్తున్న కాలువల్లోకి నీరు రావడం వల్ల రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నీరు రావడం వల్ల కాలువ పరివాహక గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దేవాదుల నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన కాలువలకు నీరు - వరంగల్ పట్టణ జిల్లా వార్తలు
వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్లోని దేవాదుల ప్రాజెక్టు నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన కాలువలకు నీటిని విడుదల చేశారు. ఐనవోలు మండలం బొల్లికుంట గ్రామానికి కాలువల ద్వారా నీరు రావడం వల్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
devadula water in new canals