తెలంగాణ

telangana

ETV Bharat / state

Mirchi Record Rate: మార్కెట్​లో మిర్చి ఘాటు.. క్వింటా @ రూ. 48 వేలు - mirchi rates in telangana

Mirchi Record Rate: అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్.. తగ్గిన దిగుబడుల కారణంగా మిర్చి రోజురోజుకీ ఘాటెక్కుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో బంగారంతో పోటీ పడుతూ.. రూ. 50 వేలకు చేరువవుతోంది. మార్కెట్​లో దేశీ రకం మిర్చి రూ. 48 వేలు పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

mirchi rate in telangana
తెలంగాణలో మిర్చి ధర

By

Published : Mar 22, 2022, 3:15 PM IST

Mirchi Record Rate: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో మిర్చి.. పసిడి ధరతో పోటీ పడుతోంది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 48,000 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశీయ రకం మిర్చి రూ. 48000 పలకగా.. సింగిల్ పట్టి రకం రూ. 45 వేలు, తేజ రకం రూ. 17,500 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామయ్య పల్లికి చెందిన మాధవరావు అనే రైతు తీసుకొచ్చిన 44 బస్తాల మిర్చికి గరిష్ఠంగా రూ. 48 వేలు దక్కినట్లు మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు.

అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటు మిరప అనుకున్నంతగా దిగుబడి రాకపోవడంతో మిర్చికి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు వెల్లడించారు. మార్కెట్ యార్డులో మిరపకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో రైతులు నిరాశగా తిరిగివెళ్తున్నారు.

ఇదీ చదవండి:Bandi Sanjay on Paddy Procurement : 'కేంద్రం కొంటానంటున్నా కేసీఆర్ సహకరించట్లేదు'

ABOUT THE AUTHOR

...view details