తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్​ నగరం అతలాకుతలమైంది. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంత్రులు వరంగల్​ నగరంలో పర్యటించారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాల వల్లే వరద ముంచెత్తిందని... వెంటనే ఆ నిర్మాణాలను కూల్చేయాలని మున్సిపల్​ అధికారులను ఆదేశించారు. అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించారు.

Demolition of illegal structures on drains in Warangal
వరంగల్​లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ..

By

Published : Aug 18, 2020, 3:51 PM IST

వరంగల్ నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలను మున్సిపాలిటీ అధికారులు షురూ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్, హన్మకొండలోని ప్రధాన రోడ్లు దెబ్బతినగా, పలు కాలనీలు నీట మునిగిపోయాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాలను మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​లతో కలిసి పరిశీలించారు.

నాలాలపై అక్రమంగా కట్టిన కట్టడాలను గుర్తించారు. తక్షణమే వాటిని కూల్చివేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు నాళాలపై అక్రమంగా కట్టిన నాలాలను కూల్చివేస్తున్నారు.

ఇవీ చూడండి: భారీ వర్షాలతో పొలాలు నీటిపాలు.. ఆందోళనలో రైతులు

ABOUT THE AUTHOR

...view details