వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీటిని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ రవీందర్ రావు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.
హన్మకొండలో ఘనంగా 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు.. - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్త
67వ అఖిల భారత సహకార వారోత్సవాలను వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పనిచేస్తుందని ఛైర్మన్ రవీందర్ రావు పేర్కొన్నారు.
హన్మకొండలో ఘనంగా 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు..
ఈ ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రైతుల అభివృద్ధి, శ్రేయస్సు కోసం డీసీసీబీ బ్యాంకు పని చేస్తుందని ఛైర్మన్ పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు టర్నోవర్ వెయ్యి కోట్ల దాటిందని.. మరో 1000 కోట్ల టర్నోవర్ చేరేలా కృషి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:బాణాసంచా వ్యాపారాలపై కరోనా దెబ్బ..