వరంగల్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ 53వ డివిజన్లో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు.
'నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం' - telangana news
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ 53వ డివిజన్లో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. త్వరలో కేటీఆర్ పర్యటిస్తారని.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్లో 300 కోట్లు కేటాయించారన్నారు. మంత్రి కేటీఆర్ ఒక ప్రణాళిక ప్రకారం పలు కార్యక్రమాల ద్వారా నగర అభివృద్ధికి శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, లైటింగ్, కూరగాయలు, చేపల మార్కెట్ల నిర్మాణాలతోపాటు భద్రకాళి బండ్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. త్వరలో కేటీఆర్ నగర పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు.
ఇదీ చూడండి: అప్పు లేకుండానే సొంతింటి కల సాకారం: హరీశ్