వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో శుక్రవారం రాత్రి స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శివరాత్రి సందర్భంగా రుద్రేశ్వరి, రుద్రేశ్వరుడికి కల్యాణం నిర్వహించారు.
స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్ భాస్కర్ దంపతులు - వరంగల్ పట్టణ జిల్లా వార్తలు
హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ఆ కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
![స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్ భాస్కర్ దంపతులు dasyam vinay bhaskar couple attend the 1000 pillar temple at hanamkonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6161250-656-6161250-1582339315412.jpg)
స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్ భాస్కర్ దంపతులు
ఆ కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణం చూసి తన్మయత్వం పొందారు.
స్వామి కల్యాణంలో పాల్గొన్న వినయ్ భాస్కర్ దంపతులు
ఇదీ చూడండి :వేగం పెరగదు.. ముందుకు సాగదు..!