తెలంగాణ

telangana

ETV Bharat / state

డాన్స్​ చేసిన పిల్లలు...మురిసిపోయిన తల్లిదండ్రులు - హన్మకొండలో శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు

హన్మకొండలో శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈలలు, చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది.

Dancing kids grumpy parents at hanamkonda
డాన్స్​ చేసిన పిల్లలు...మురిసిపోయిన తల్లిదండ్రులు

By

Published : Mar 1, 2020, 3:00 PM IST

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు సందడి చేశారు. వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు తమ నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

తమ పిల్లలు చేసిన నృత్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. పలువురు తమ చరవాణిలో పిల్లల నృత్యాలను తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చిన్నారుల నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

డాన్స్​ చేసిన పిల్లలు...మురిసిపోయిన తల్లిదండ్రులు

ఇదీ చూడండి :ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details