తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం దినసరి వేతన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఛాంబర్‌ను ముట్టడించారు. వీసీ కార్యాలయంలో బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దినసరి వేతన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను ప్రకటించి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరారు.
కేయూ వీసీ ఛాంబర్ ముట్టడించిన ఉద్యోగులు - ku
తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ.. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం దినసరి వేతన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
వీసీ ఛాంబర్ ముట్టడి