రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని.. బంగారు తెలంగాణను సాకారం చేయాలని కోరుతూ కరీంనగర్ నుంచి శబరిమలకు ఓ అయ్యప్ప స్వామి భక్తుడు సైకిల్ యాత్రను చేస్తున్నారు. ఈ నెల 9న కరీంనగర్ నుంచి యాత్రను ఆరంభించి... వరంగల్‌కు చేరుకుని అక్కడి అన్ని దేవాలయాలను సందర్శించినట్లు తెలిపారు.
బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర - బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర
బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్ కృషి చేయాలని కోరుతూ కరీంనగర్ నుంచి శబరిమల వరకు అయ్యప్ప స్వామి భక్తుడు శ్రీనివాస్ సైకిల్ యాత్ర చేస్తున్నారు.
బంగారు తెలంగాణ కోసం శబరిమలకు సైకిల్ యాత్ర
తొమ్మిదేళ్ల నుంచి ఏటా సైకిల్ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన యాత్రలో భాగంగా హైదరాబాద్ వెళ్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. సైకిల్ పై ఇదే తన చివరి యాత్ర అని.. తన అభిమాన సీఎంను కలిసే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?
Last Updated : Dec 24, 2019, 11:48 AM IST
TAGGED:
cycle yatra to sabarimala