Cybercrime in Hanmakonda : ఎవరెంతగా చెప్పినా, అవగాహన కల్పించినా సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. అధిక డబ్బును సంపాదించవచ్చుననే ఆశతో మోసగాళ్ల బారిన పడి పలువురు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ తరహా ఘటన తాజాగా హనుమకొండలో చోటు చేసుకుంది. విమాన టిక్కెట్ల బుకింగ్ ఏజెన్సీ పేరుతో ఓ వ్యక్తి మోసం చేసి రూ. 37 లక్షలు కాజేసిన ఘటన పట్టణంలోని పెద్దమ్మగడ్డలో జరిగింది.
'ఐ'రేంజ్ మోసం - హోల్‌సేల్ ధరలో ఫోన్లు కావాలంటూ నట్టేట ముంచిన వ్యక్తి అరెస్ట్
పెద్దమ్మగడ్డకు చెందిన ఓ యవకుడికి విమాన టిక్కెట్ ఏజెన్సీ ఇస్తామని, పార్ట్ టైం చేసినా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చంటూ ఓ వ్యక్తి టెలిగ్రాం యాప్ ద్వారా సందేశం పంపించాడు. ఇదంతా నిజమని నమ్మిన ఆ యువకుడు రూ 37.59 లక్షల రూపాయలను అతని ఖాతాలోకి జమ చేశాడు. ఆ తరువాత ఫోన్ చేస్తే సదరు వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఫోన్ స్విచాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన యువకుడు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Cybercrime in the name of Air Ticket :ఇటువంటి మరో ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది.విదేశాలకు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేస్తానని చెప్పి మోసం చేసిన మరో ఘటన హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లష్కర్ సింగారానికి చెందిన విద్యార్థి బంధువులు కెనడాకు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో చెన్నైకి చెందిన కల్యాణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను ప్రైవేటు విమాన సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నానని చెప్పి సదరు విద్యార్థిని నమ్మించాడు.