వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. మరికొన్ని చోట్ల వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. పలు చోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైన ధాన్యం - తెలంగాణ వార్తలు
అకాల వర్షాలతో ఆరుగాలం సాగు చేసిన పంట నీటిపాలైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన పంట వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. పొలంలోని పంట నేలకొరిగింది. మరో మూడు రోజులు వర్ష సూచన ఉండడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలతో పంట నష్టం, నీట మునిగిన పంట
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో మూడు రోజులు వర్ష సూచన ఉండడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాలతో పొలంలోని పంట నేలకొరిగింది.
ఇదీ చదవండి:చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్