తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం జన్మదినం పురస్కరించుకొని పోటీలు.. విజేతలకు ట్రోఫీలు - Warangal Urban District Latest News

సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలు ముగిసాయి. గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీని ప్రభుత్వ చీఫ్​ విప్​, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అందజేశారు. క్రీడా స్పూర్తిని చాటిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

Cricket competitions in Warangal West constituency are over
విజేతలకు ట్రోఫీ అందించిన ఎమ్మెల్యే వినయ భాస్కర్

By

Published : Feb 20, 2021, 1:56 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో తెరాస విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలు ముగిసాయి. పోటీల్లో గెలుపొందిన 42వ డివిజన్ క్రీడాకారులకు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల్లో ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో పోటీలను నిర్వహించామని వినయ్​ భాస్కర్​ అన్నారు. ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పోటీల్లో విజయం సాధించిన 42వ డివిజన్ క్రీడాకారులకు రూ.50,116, రెండో స్ధానంలో నిలిచిన 37వ డివిజన్ జట్టుకు 25,116 రూపాయల నగదు అందజేశారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన టీఆర్‌ఎస్‌వీ బృందాన్ని అభినందించారు.

ఇదీ చూడండి:'గిరిజనుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ'

ABOUT THE AUTHOR

...view details