తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో క్రెడాయ్ మొట్ట మొదటి ప్రాపర్టీ షో - Held their first property show in Warangal hanamkonda

దేశంలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు చెందిన అత్యున్నత సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్​) వరంగల్​లో తమ మొట్ట మొదటి ప్రాపర్టీ షో నిర్వహించింది.

వరంగల్​లో క్రెడాయ్ మొట్ట మొదటి ప్రాపర్టీ షో

By

Published : Oct 19, 2019, 8:22 PM IST

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్​) వరంగల్​లో తమ మొట్టమొదటి ప్రాపర్టీ షోను నిర్వహించింది. హన్మకొండలోని నందన గార్డెన్​లో రెండు రోజులపాటు జరిగే ప్రాపర్టీ షోను ప్రభుత్వ ఛీప్ విప్ వినయ భాస్కర్, ఎమ్మెల్యేలు రమేష్, ధర్మారెడ్డి, సతీష్​లు ప్రారంభించారు. హైదరాబాద్ తరహాలో వరంగల్​ నగరం విద్య, వ్యాపార, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించడం సంతోషకరమన్నారు.

రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకర్లు, కన్సల్టెంట్లను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ ప్రాపర్టీషోను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలంగాణ క్రెడాయి ఛైర్మన్ రాంరెడ్డి పేర్కొన్నారు.

వరంగల్​లో క్రెడాయ్ మొట్ట మొదటి ప్రాపర్టీ షో

ఇదీ చూడండి : అకాల వర్షాలు.. అన్నదాతలకు కష్టాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details