జమిలి ఎన్నికలు రాజ్యాంగ ఉల్లంఘనేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. హనుమకొండ జిల్లాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు నేటి నుంచి 3 రోజులపాటు నిర్వహించనున్నారు. హనుమకొండలో జరిగే సమావేశాలకు హాజరైన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమిలి ఎన్నికలపై స్పందించారు.
జమిలి ఎన్నికలు రాజ్యాంగ ఉల్లంఘనే: సీతారాం ఏచూరి
హనుమకొండ జిల్లాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమిలి ఎన్నికలపై స్పందించారు.
సీతారాం ఏచూరి
ప్రజలు వేసిన ఓట్ల ఆధారంగా ప్రభుత్వం ఏర్పాడుతోంది. కొన్ని సార్లు ఎవరో ఒక పార్టనర్ తన మద్దతును ఉపసంహరించుకోవచ్చు... మైనార్టీ సర్కార్ ఎన్నికలకు వెళ్లకుండా ఆపడం సాధ్యమవుతుందా. బలవంతంగా జమిలి ఎన్నికలను రుద్దే ప్రయత్నం తగదు. -సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి:కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్ రెడ్డి