తెలంగాణ

telangana

ETV Bharat / state

అలా చేస్తేనే టీఆర్ఎస్​కు మద్దతు కొనసాగిస్తాం : కూనంనేని

Kunamneni comments on modi : ఐటీ, ఈడీ దాడులతో దేశంలో విపక్షాలను మోదీ సర్కార్‌ బెదిరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో 3వేల ఈడీ దాడులు జరిగితే.. బీజేపీ నేతలపై ఎన్ని జరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇదేనా అని నిలదీశారు.

Kunamneni comments on modi
మోదీ దేశంలో అరాచకం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారు: కూనంనేని

By

Published : Nov 25, 2022, 12:34 PM IST

మోదీ దేశంలో అరాచకం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారు: కూనంనేని

Kunamneni comments on modi : ప్రధాని మోదీ దేశంలో అరాచకం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పాలన సమయంలోనూ ఇలా లేదన్నారు. హనుమకొండలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్​తో కలిసి పని చేస్తామని.. అయితే అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని కూనంనేని పేర్కొన్నారు. బీజేపీపై టీఆర్​ఎస్​ పోరాటం ఇలాగే కొనసాగితే తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్, జ్యుడీషియరీ ఉపయోగించి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూనంనేని ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్లలో 3 వేల పైచిలుకు ఈడీ దాడులు చేశారని.. విపక్ష నేతలను లొంగదీసుకునేందుకే ఈ దాడులని ఆక్షేపించారు. బీజేపీ నేతలపై ఎన్ని దాడులు జరిగాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. చట్టాలు తెలియని అజ్ఞాని బండి సంజయ్ అని.. పోసాని కృష్ణమురళికి నకలు అని ఎద్దేవా చేశారు.

ఆ డిమాండ్​ను వ్యతిరేకిస్తున్నాం..: ఎఫ్​ఆర్​వో శ్రీనివాస్​రావు హత్యను సీపీఐ ఖండిస్తోందని కూనంనేని పేర్కొన్నారు. అటవీ సిబ్బందికి తుపాకులివ్వడం అనే డిమాండ్​ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు.

"భవిష్యత్తులోనూ తెరాసతో కలిసి పనిచేస్తాం. కేంద్ర సంస్థల సాయంతో రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునేందుకే ఈ దాడులు చేస్తున్నారు. ఎనిమిదేళ్లలో 3 వేల పైచిలుకు ఈడీ దాడులు చేశారు. బీజేపీ నేతలపై ఎన్ని దాడులు జరిగాయో చెప్పాలి. పోడుభూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. అటవీ శాఖ సిబ్బందికి తుపాకుల ప్రతిపాదనకు మేం వ్యతిరేకం." - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చూడండి..:

అటవీ అధికారులకు మద్దతివ్వాలి.. పోలీసులకు డీజీపీ ఆదేశాలు

అడ్డంకులను ఫుట్​బాల్​ ఆడేసి.. రాష్ట్రానికి తొలి కోచ్​గా రాణిస్తున్న యువతి

ABOUT THE AUTHOR

...view details