తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నారు: సీపీఐ - వరంగల్​ అర్బన్​ జిల్లా తాజా వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నాయని సీపీఐ వరంగల్​ జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు.

cpi ryally in warangal urban district
పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నారు: సీపీఐ

By

Published : Dec 26, 2020, 7:19 PM IST

భారత కమ్యూనిస్టు పార్టీ 95వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్​ జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఎర్రజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.

95 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పేదవాడికి రాజ్యాధికారం దక్కే విధంగా అనేక ఉద్యమాలు చేయనున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:రేపు రజినీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం: అపోలో వైద్యులు

ABOUT THE AUTHOR

...view details