తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరోజును చీకటి రోజుగా పరిగణిస్తున్నాం' - అయోధ్య భూమిపూజపై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని రక్షించండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

'ఆరోజును చీకటి రోజుగా పరిగణిస్తున్నాం'
'ఆరోజును చీకటి రోజుగా పరిగణిస్తున్నాం'

By

Published : Aug 10, 2020, 7:47 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ.. అయోధ్యలో రామాలయం భూమి పూజకు వెళ్లడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆ రోజును చీకటి రోజుగా పరగణిస్తున్నామని అన్నారు. ఆయన వరంగల్​లో పర్యటించారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని రక్షించండి... ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.

దేశం అభివృద్ధిలో అగ్రస్థానంలో లేకున్నా... కొవిడ్ కేసుల్లో మాత్రం ప్రపంచంలో మూడో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. కరోనాను నియంత్రించడంలో రెండు తెలుగు రాష్టాలు విఫలమయ్యాయని నారాయణ అన్నారు. మద్యం షాపులు తెరుచుకున్నాకే కరోనా కేసులు పెరిగిపోయాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details