నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: చాడ - cpi chada latest news
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చాడ ఆరోపించారు. సునీల్ నాయక్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటలకు సాగు నీరందక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎండిపోతున్న పంటలకు నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.