తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : వరంగల్​లో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టం - ETV BHARAT EFFECT

వరంగల్ అర్బన్ జిల్లాలో నో మూమెంట్ జోన్ లో వాహనాల రాకపోకలు అంతంతమాత్రంగానే అంటూ ఇటీవలే ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి సీపీ రవీందర్ స్పందించారు. లాక్​ డౌన్​ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలంటూ అధికారులను సీపీ ఆదేశించారు.

బయట తిరగొద్దు...వాహనాలు సీజ్ చేస్తాం : సీపీ
బయట తిరగొద్దు...వాహనాలు సీజ్ చేస్తాం : సీపీ

By

Published : Apr 8, 2020, 1:23 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లాలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్​ని మరింత పటిష్ఠంగా అమలు చేయనున్నట్లు వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. ఇటీవలే ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి సీపీ రవీందర్ స్పందించారు. నగరంలోని ఎంజీఎం కూడలి వద్ద స్వయంగా కమిషనర్ వాహనాలను తనిఖీ చేశారు. అనవసరంగా రోడ్డెక్కిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయా వాహనాలను ఠాణాకు తరలించాలని అధికారులకు సూచించారు.

మరింత కట్టుదిట్టం...

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో లాక్ డౌన్ అమలు తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్​ని మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. సీపీ రాకతో అప్రమత్తమైన సిబ్బంది... వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

బయట తిరగొద్దు...వాహనాలు సీజ్ చేస్తాం : సీపీ

ఇవీ చూడండి : రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details