వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ (Vaccination) వేగవంతం చేస్తున్నారు. బుధవారం ఒక్క రోజే 6,125 మందికి టీకాలు వేశారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.
Vaccination : ఆటో డ్రైవర్ల వ్యాక్సినేషన్ వేగవంతం - covid vaccine to auto drivers in telangana
రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ (Vaccination) ముమ్మరంగా సాగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నేడు ఆటో డ్రైవర్లకు టీకా వేస్తున్నారు. ఉదయం నుంచే టీకా కేంద్రాల వద్ద వారు బారులు తీరారు.
కరోనా వ్యాక్సినేషన్, కొవిడ్ వ్యాక్సినేషన్, వరంగల్లో కరోనా వ్యాక్సినేషన్
గురువారం నుంచి ఆటో డ్రైవర్లకు మాత్రమే టీకాలు(Vaccination) వేస్తున్నారు. వారి కోసం నగరంలో 5 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకొక్క కేంద్రంలో వెయ్యి మందికి పైగా టీకాలు వేస్తున్నారు. ఉదయం నుంచే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.