తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​కు చేరుకున్న కొవిడ్ టీకా - మొదటి విడత కొవిడ్ టీకాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు కొవిడ్ టీకాల తరలింపు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి.. టీకాలు చేరుకోవడంతో జిల్లా వైద్యాధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

covid vaccine reached Warangal
వరంగల్​కు చేరుకున్న కొవిడ్ టీకా

By

Published : Jan 14, 2021, 8:13 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి.. కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. ప్రభుత్వం.. మొదటి విడతగా జిల్లాకు 2640 టీకాలను పంపింది.

టీకా రాకను పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారులు, ఇతర సిబ్బంది.. కొబ్బరికాయలు కొట్టి పూలదండలతో స్వాగతం పలికారు. రెండో విడతలో మరిన్ని టీకాలు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణలో తొలి కొవిడ్ టీకా.. పారిశుద్ధ్య కార్మికుడికే!

ABOUT THE AUTHOR

...view details