తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం ఆసుపత్రిలో 24 గంటలు కొవిడ్ పరీక్షలు - MGM hospital LATEST NEWS

రోజురోజుకు కరోనా కేసులు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇకపై కొవిడ్ టెస్టులు 24 గంటలు చేయనున్నారు.

warangal mgm
warangal mgm

By

Published : Apr 22, 2021, 4:10 PM IST

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇక 24 గంటలు కొవిడ్ పరీక్షలు చేయనున్నారు. రోజురోజుకి కరోనా కేసులు పెరగడం వల్ల… ఎంజీఎంలో కొవిడ్ పరీక్షల కోసం ప్రజలు బారులు తీరారు. 24 గంటలు కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీనితో రేపట్నుంచి రోజులో ఎప్పుడు వచ్చినా… పరీక్షలు చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్​ వెల్లడించారు.

263 మంది కరోనా రోగులు ఆసుపత్రి కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని… అవసరమైన మేరకు నిల్వలు ఉన్నాయని సూపరింటెండెంట్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details