తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో మాస్కు ధరిస్తూనే నాగులపంచమి వేడుకలు - హన్మకొండలో నాగులపంచమి వేడుకలు

నాగుల పంచమి సందర్భంగా పాము పుట్టల వద్ద సందడి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండ వద్దనున్న పబ్లిక్ గార్డెన్ లో ఉన్న పాము పుట్ట వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి పాలు పోశారు.

covid instructions followed in nagulapanchami celebrations
హన్మకొండలో మాస్కు ధరిస్తూనే నాగులపంచమి వేడుకలు

By

Published : Jul 25, 2020, 2:47 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ లో ఉన్న పాము పుట్ట వద్దకు తెల్లవారుజాము నుంచే మహిళలు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో భక్తులందరూ విధిగా మాస్కులు ధరించి వచ్చారు. పుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. నాగదేవతకు కానుకలు సమర్పించి దీపారాధన చేశారు.

మహిళలు అధిక సంఖ్యలో రాగా.. అధికారులు వారిని భౌతిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహించాలని కోరారు. కొందరు నిర్లక్ష్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోగా..పూజ చేసేందుకు అధికారులు పుట్ట వద్దకు అనుమతించలేదు.

ఇదీ చదవండిఃకొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ABOUT THE AUTHOR

...view details