వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన ఓ మహిళ(50) నిన్న రాత్రి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇవాళ ఆమె అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఆమె భర్త గన్ను రాజుకు (55) గుండెపోటు వచ్చింది. అతన్ని 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
భార్య కరోనాతో.. భర్త గుండెపోటుతో.. - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
కరోనా, కుటుంబాల్లో తీరాని శోకాన్ని మిగులుస్తోంది. భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, అన్నదమ్ములు, తల్లీకొడుకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో భార్య కొవిడ్‌తో మృతి చెందగా భర్త గుండెపోటుతో మరణించారు.
భార్య కరోనాతో.. భర్త గుండెపోటుతో మృతి
భార్యాభర్తలు చనిపోవటంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా వారికి వివాహాలు చేశారు.
ఇదీ చదవండి:ఆపదలో ఆత్మీయత.. ఈ స్టార్టప్‌ల ప్రత్యేకతయత.. ఈ స్టార్టప్‌ల ప్రత్యేకత