31 నుంచి వైద్యవిద్య మూడో విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ ధపాలో రెండో విడతలో మిగిలిన సీట్లతో పాటు రాష్ట్రానికి ఆర్థిక బలహీనవర్గాల(ఈడబ్యూఎస్ ) కోటా కింద వచ్చిన 190 ఎంబీబీఎస్ సీట్లను, అఖిలభారత వైద్యవిద్య కోటాలో మిగిలిన సీట్లను కలిపి భర్తీ చేస్తారు. అఖిల భారత కోటాలో రెండో విడతలో సీట్లు పొంది కళాశాలల్లో చేరనివారికి సంబంధించి 15 శాతం సీట్లు రాష్ట్రానికి తిరిగి అందజేస్తారు. 2నుంచి వెబ్ ఆప్షన్స్
వచ్చే నెల 2 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశమిస్తారని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. 5న సీట్ల కేటాయింపు ఉంటుంది. కళాశాలల్లో అభ్యర్థులు చేరడానికి 10 వరకు గడువు ఇస్తారు. అఖిల భారత కోటాలో రెండో విడతలో సీటు వచ్చి కళాశాలల్లో చేరనివారికి మూడో విడతలో ప్రవేశానికి అర్హత ఉండదు. ఎన్సీసీ, కేంద్ర సాయుధ రిజర్వు బలగాల కుటుంబాల పిల్లలకు కేటాయించిన సీట్లను కూడా ఈ ధపాలోనే భర్తీ చేస్తారు.
25 నుంచి యాజమాన్య కోటా ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్యకళాశాలల్లో యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటాలో ఆన్లైన్లో సీట్ల భర్తీ ఈ నెల 25 నుంచి 28 వరకు చేపడతారు. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 2లోపు కళాశాలల్లో చేరడానికి గడువు ఉంటుంది.
ఇవీ చూడండి: మబ్బు విడిచిన వరుణుడు... విస్తారంగా జల్లులు