నాలుగు రోజుల సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. సీజన్ మొదలవడం వల్ల మార్కెట్ యార్డ్ తెల్లబంగారం బస్తాలతో కళకళలాడుతోంది. క్వింటాకి రూ.4,735 ధర పలికింది. ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేయకపోవడం వల్ల క్వింటాకి రూ.వెయ్యికి పైగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన పత్తి - ఎనుమాముల మార్కెట్‌లో పత్తి ధర
పత్తి సీజన్ మొదలవడం వల్ల వరంగల్ ఎనుమాముల మార్కెట్ తెల్లబంగారంతో కళకళలాడుతోంది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. సీసీఐ కొనుగోలు చేయకపోవడం వల్ల క్వింటాకి రూ.1000కి పైగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన తెల్లబంగారం
పెద్దమొత్తంలో పత్తి తరలిరావడం వల్ల మార్కెట్ ఛైర్మన్ పత్తిని పరిశీలించారు. రైతులకు దక్కుతున్న ధరలను అడిగి తెలుసుకున్నారు. గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తీసుకురావాలని అన్నదాతలకు సూచించారు.
ఇదీ చదవండి:రైతుకు సాయం.. యువతకు ఆదాయం!