తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్కెట్​కి పత్తి రాక.. గతేడాది కంటే సగానికి తగ్గిన ధర - cotton rate today in warangal

వరంగల్ మార్కెట్​కి పత్తి రాక మొదలైంది. ఈ సందర్భంగా ఎనుమాముల మార్కెట్ యార్డులో వ్యాపారులు పూజలు నిర్వహించారు. క్వింటాల్ పత్తి సగటు ధర రూ.3,500గా అధికారులు నిర్ణయించారు.

cotton sales started in warangal enamamula market yard
మార్కెట్ లో పత్తి కళ

By

Published : Sep 24, 2020, 6:27 PM IST

వరంగల్ ఎనుమాముల మార్కెట్​కు కొత్త పత్తి రాకతో మార్కెట్ యార్డులో వ్యాపారులు పూజలు చేశారు. కాంటాని అలంకరించి మంచి ముహూర్తంలో తూకాలు నిర్వహించారు. పత్తి క్వింటాలు ధర రూ. 4100 కాగా కనిష్ఠంగా రూ. 2500 నమోదైంది. సగటు ధర రూ.3500 గా అధికారులు నమోదు చేశారు.

ఆవేదనలో రైతులు

పత్తి ధరలు గతంతో పోలిస్తే సగానికి పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలతో పెట్టుబడి కూడా రాదని దిగులు పడుతున్నారు.

ఇదీ చదవండి: తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలే: తలసాని

ABOUT THE AUTHOR

...view details