వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో కొవిడ్ సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్ నియంత్రణలో భాగంగా నేడు, రేపు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పాత్రికేయులు, మీడియా సిబ్బంది, ఎఫ్సీఐ సిబ్బంది, ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, సిబ్బంది, పెట్రోల్ బంక్ సిబ్బంది, ఫర్టిలైజర్, పురుగుల మందు డీలర్లు, విత్తన పంపిణీ డీలర్లను ప్రభుత్వం.. వాహకులుగా గుర్తించి వారికి టోకెన్లు జారీ చేసింది.
Super spreaders: కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ - telangana news
వరంగల్ అర్బన్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈరోజు, రేపు ఈ ప్రక్రియ జరగనుంది. టోకెన్లు పొందిన వారు, గుర్తింపు కార్డులు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
టోకెన్లు పొందిన వారు తమకు దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రం వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. టోకెన్లు పొందని వారు కూడా సంబంధిత గుర్తింపు కార్డులను చూపించి టీకా వేయించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా..?