తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు - corona cases in warangal

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పరీక్షలు కూడా పెరుగుతున్నాయి. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో నెలకొల్పిన కరోనా పరీక్షల నిర్ధరణ కేంద్రంలో సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారు. ఆరంభంలో రెండు జిల్లాలకు సంబంధించి మాత్రమే పరీక్షలు జరిగినా ఇప్పుడు మొత్తం 12 జిల్లాలకు సంబంధించినవారికి పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు.

corona tests at kakathiya medical college in warangal
కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు

By

Published : Jul 2, 2020, 12:55 PM IST

Updated : Jul 2, 2020, 4:35 PM IST

కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు

కాకతీయ వైద్య కళాశాలలోని కరోనా పరీక్షల నిర్ధరణ కేంద్రంలో కరోనా పరీక్షలు భారీగా చేస్తున్నారు. సిబ్బంది 24 గంటలు పనిచేస్తూ ఫలితాలు వెల్లడిస్తున్నారు. మొదట్లో రెండు జిల్లాలకు సంబంధించి మాత్రమే పరీక్షలు జరిగినా ఇప్పుడు మొత్తం 12 జిల్లాలకు సంబంధించినవారికి పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. కోటి 70 లక్షల వ్యయంతో అత్యంత అధునాతన సదుపాయాలతో వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో నెలకొల్పిన ఈ వైరాలజీ ల్యాబ్​ లో రోజు రోజుకీ కరోనా వైరస్ పరీక్షలు, నిర్ధరణ కేసులు పెరుగుతున్నాయి. వైరల్‌ రిసర్చ్‌ డయాగ్నోస్టిక్‌ (వీఆర్‌డీఎల్) గ్రేడ్ 3 ల్యాబ్​గా పిలిచే ఈ ప్రయోగశాలను రెండున్నర నెలల క్రితం మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు.

రోజుకు రెండువందల పరీక్షలు

కరోనా వైరస్​తోపాటుగా.. పలురకాల ఇతర వైరస్​లనూ నిర్ధరించే అవకాశాలు ఇక్కడున్నా.. ప్రస్తుతం కొవిడ్​ పరీక్షలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించి.. పనిచేసే ఈ ల్యాబ్​లో.. రోజుకు రెండువందల దాకా కేసులకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాలే కాకుండా... పరిసర ప్రాంత జిల్లాలకు సంబంధించిన వైరస్ నిర్ధరణ పరీక్షలూ ఇప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి.

కుటుంబసభ్యులకు దూరంగా...

వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయడం సాహసంతో కూడుకున్నదే. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా... చేసేవారికి వైరస్ సోకుతుంది. అందుకే పనిచేసే ల్యాబ్ సిబ్బంది మొత్తం తమ కుటుంబసభ్యులకు దూరంగా... వైద్య కళాశాలలలోనే ఉండి పరీక్షల నిర్ధరణ చేస్తున్నారు.రోజు రోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తోండడం వల్ల ఇక్కడ పనిచేసే వారికి క్షణం కూడా తీరిక ఉండట్లేదు. అదనపు సిబ్బందిని కేటాయిస్తే... షిఫ్టులు పెంచుకుని మరిన్ని ఎక్కువ పరీక్షలు చేస్తామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

Last Updated : Jul 2, 2020, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details