ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కర్ప్యూ వాతావరణం కొనసాగుతోంది. హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవ్వరూ బయటకు రావద్దని... ముఖ్యమైన పని ఉంటేనే బయటకు రావాలని పోలీసులు సూచించారు.
నిర్మానుష్యంగా మారిన ప్రధాన వీధులు - వరంగల్ జిల్లా
వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగరంలో అడుగడుగునా పోలీసులు గస్తీ కాస్తున్నారు. అత్యవసరముంటేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
నిర్మానుష్యంగా మారిన ప్రధాన వీధులు
ప్రజలంతా ఇళ్లకే పరిమతం అయ్యారు. నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు మాత్రమే బయటకు వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ నగరంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చూడండి:ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ మార్గదర్శకాలివే...