వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. మధ్యాహ్నం 12 గంటలు గడిచినా.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు రాలేదు. ఓటింగ్ ప్రారంభం నుంచి మందకొడిగానే సాగుతోంది. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు కరోనా భయంతో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
కళతప్పిన ఓటింగ్ కేంద్రాలు.. అభ్యర్థుల గుండెల్లో గుబేలు - telangana news 2021
కరోనా ప్రభావం గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్‌పై పడింది. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. మధ్యాహ్నం 12 గంటలు గడిచినా.. కొన్ని కేంద్రాల్లో 23 శాతం ఓటింగ్ నమోదు కాకపోవడం వల్ల అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు
మధ్యాహ్నం 12 గంటల వరకు 31.06 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని వార్డుల్లో 23 శాతానికి మించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. తెలిసిన వారిని ఇంటికి వెళ్లి మరీ ఓటు వేయాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు.